ప్రైవేట్ వైద్యుల వ్యాక్సిన్ కోటాలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ కరోనా టీకా వేయించుకున్నారు. జిల్లా ఆస్పత్రి వైద్య సిబ్బంది ఆయనకు కొవిడ్ వ్యాక్సిన్ వేశారు. కరోనా టీకాపై ఎలాంటి భయాందోళనలు అవసరం లేదన్నారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ - కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ కుమార్
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. జిల్లా ఆస్పత్రిలో ప్రైవేట్ వైద్యుల కోటాలో కరోనా టీకాను వేయించుకున్నారు.

ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు కొవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్న వైద్య సిబ్బంది
ప్రజలకు వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ సూచించారు. కరోనా సమయంలోనూ విశేషంగా సేవలందించిన వైద్యసిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.