తెలంగాణ

telangana

ETV Bharat / state

'జగిత్యాల పురపాలికలో గులాబీ రెపరెపలాడటం ఖాయం' - జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్​ కుమార్

జగిత్యాల పురపాలికలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే సంజయ్​ కుమార్​ ధీమా వ్యక్తం చేశారు. తెరాసకు ఓటు వేసి గెలిపిస్తే పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

jagtial mla sanjay kumar says that trs will win in jagtial municipality
'జగిత్యాల పురపాలికలో గులాబీ రెపరెపలాడటం ఖాయం'

By

Published : Jan 12, 2020, 4:59 PM IST

జగిత్యాల పట్టణానికి తెరాస ప్రభుత్వం ఇప్పటికే 50 కోట్ల నిధులు విడుదల చేసి అభివృద్ధి పనులు చేస్తోందని ఎమ్మెల్యే సంజయ్​ కుమార్​ తెలిపారు. పురపాలక ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

'జగిత్యాల పురపాలికలో గులాబీ రెపరెపలాడటం ఖాయం'

మున్సిపల్​ ఎన్నికల్లో తెరాస గెలుపు ఖాయమని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాలలో రహదారి విస్తరణ పనులు చేపడుతున్నామని, తాగు నీరు, మాతా శిశు సంరక్షణకు నూతన ఆసుపత్రి నిర్మిస్తున్నామని వెల్లడించారు. జగిత్యాల మున్సిపల్​ ఎన్నికల్లో గులాబీ పార్టీని గెలిపిస్తే... ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details