కరోనా వైరస్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిశుభ్రతను పాటించాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కోరారు. దగ్గు, జ్వరం వచ్చిన వాళ్లు నిర్లక్ష్యం చేయకుండా ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.
'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... ప్రభుత్వానికి సహకరించాలి' - జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వార్తలు
కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ సూచించారు. ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... ప్రభుత్వానికి సహకరించాలి'
పిల్లలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో, శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని పేర్కొన్నారు. పొరుగుదేశాల నుంచి వచ్చిన వారిపై మరింత శ్రద్ధ చూపించాలని అధికారులకు సూచించారు.