తెలంగాణ

telangana

ETV Bharat / state

Anandaiah: 'కళ్లలో పసరుపోస్తే కరోనా తగ్గుతుందా.. అది అసాధ్యం' - కృష్ణపట్నం ఆనందయ్య మందుపై ఎమ్మెల్యే సంజయ్​కుమార్​ విమర్శలు

కృష్ణపట్నం ఆనందయ్య మందుపై జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్​కుమార్​ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మందు తీసుకున్న వారంతా కళ్ల మంటతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. ప్రజలు అపోహలు వీడాలని సూచించారు.

jagtial mla comments on anandaiah medicine
ఆనందయ్య మందుపై జగిత్యాల ఎమ్మెల్యే కామెంట్స్​

By

Published : May 28, 2021, 1:53 PM IST

Updated : May 28, 2021, 3:47 PM IST

కృష్ణపట్నం ఆనందయ్య మందు సరైంది కాదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్​ సంజయ్​ కుమార్​ విమర్శించారు. ఆయన ఇచ్చిన మందు వాడిన ప్రజలు రాత్రంతా కళ్ల మంటతో ఇబ్బందులు పడ్డారని అన్నారు. జిల్లాలోని పలువురు రోగులు ఆనందయ్య ఇచ్చిన మందును వాడగా వారంతా ప్రస్తుతం స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని పరామర్శించిన ఎమ్మెల్యే మందు పనిచేస్తుందా లేదా అని అడిగారు.

కళ్ల డాక్టర్ అయినా కళ్లలో పసరు పోస్తే జబ్బు తగ్గదని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. ఆయన ఇచ్చే మందుతో కరోనా తగ్గితే ఆనందయ్యకు పాదాభివందనం చేస్తానన్నారు. ప్రజలు అపోహలు వీడి ప్రభుత్వం ఇచ్చే మందులు వాడి, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

'కళ్లలో పసరుపోస్తే కరోనా తగ్గిందా.. అది అసాధ్యం'

ఇదీ చదవండి:lockdown 2.0: లాక్‌డౌన్‌పై ప్రజలు ఏమనుకుంటున్నారు?: సీఎం కేసీఆర్

Last Updated : May 28, 2021, 3:47 PM IST

ABOUT THE AUTHOR

...view details