Jagtial Medical College: మారుమూల ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా మొదట 8 మెడికల్ కాలేజీలను నిర్మిస్తోంది. మెరుగైన వైద్య సేవల కోసం గ్రామీణ ప్రాంతవాసులు పట్టణాలకు, నగరాలను పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా.. అన్ని సదుపాయాలతో వీటిని తీర్చిదిద్దుతోంది. వీటి పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. అందులో భాగంగానే.. క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులను మంత్రి ప్రశాంత్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. జగిత్యాల వైద్యకళాశాల నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి.. 80 శాతం పనులు పూర్తయ్యాయని త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకుంటామని తెలిపారు.
మెరుగైన వైద్యం..
Medical College in Jagtial: వైద్యకళాశాలకు అవసరమైన సిబ్బంది నియామకం పూర్తి అయ్యింది. అనాటమీ, సైకాలజీ, కెమిస్ట్రీ విభాగానికి సంబంధించి మౌలిక సదుపాయాలు ఇప్పటికే కల్పించారని వైద్యకళాశాల వైద్యశాఖ అధికారులు తెలిపారు. మెడికల్ కాలేజీతో మెరుగైన వైద్యం అందుతుందని స్థానిక నేతలు అంటున్నారు.
అనుమతి రావాలంటే..
Jagtial Medical College Works: మెడికల్ కాలేజీకి అనుమతి రావాలంటే 400పడకల ఆసుపత్రి అందుబాటులో ఉండాలన్న నిబంధన ఉంది. ప్రస్తుతం జగిత్యాలో 100 పడకల ఆసుపత్రితో పాటు మాతాశిశు కేంద్రంలో కేవలం 130 పడకలు మాత్రమే ఉన్నాయి. అందువల్ల మాతాశిశు కేంద్రంలో అదనంగా 162 పడకలు నిర్మించబోతున్నట్లు అధికారులు వివరించారు.
వైద్యంలోనూ మనమే నంబర్ వన్!