జగిత్యాల జిల్లా కేంద్రంలోని రైతులు చలో కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టారు. మక్కలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్‌ను ముట్టడించడానికి యత్నించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు.
కలెక్టరేట్ ముట్టడికి రైతుల యత్నం.. ఎక్కడికక్కడ అరెస్టు - jagtial farmers protest
మక్కలు కొనుగోలు చేయాలంటూ జగిత్యాల జిల్లా కేంద్రంలో అన్నదాతలు చలో కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టారు. వారిని అడ్డుకున్న పోలీసులు.. అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
![కలెక్టరేట్ ముట్టడికి రైతుల యత్నం.. ఎక్కడికక్కడ అరెస్టు jagtial-farmers-protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9282164-300-9282164-1603439142297.jpg)
కలెక్టరేట్ ముట్టడికి రైతుల యత్నం.
కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన రైతులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కల్యాణ మండపాల్లో వారిని నిర్బంధించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మక్కలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.