జగిత్యాల జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. వైరస్ వ్యాప్తితో భయానికి గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. జనం బయటకు రాకపోవడం వల్ల ఆర్టీసీలో ప్రయాణించే వారు కరవయ్యారు. జగిత్యాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన రెండు ఆర్టీసీ బస్సులు గంటన్నరకు పైగా ప్లాట్‌ఫారమ్ పై ఎదురుచూసినా.. జనం ఎక్కకపోవడం వల్ల డిపోకే తిరిగి వెళ్లిపోయాయి.
కరోనా ఎఫెక్ట్ : ఇళ్లకే పరిమితమైన జనం .. రోడ్లన్నీ నిర్మానుష్యం - corona deaths in jagtial district
కరోనా వైరస్ వ్యాప్తితో చాలా వరకు ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. జనం బయటకు రాకపోవడం వల్ల ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు కరవయ్యారు. ఫలితంగా రహదారులు నిర్మానుష్యంగా మారాయి.
జగిత్యాల జిల్లా వార్తలు, జగిత్యాల జిల్లాలో కరోనా వ్యాప్తి, జగిత్యాలలో కరోనా కేసులు
మిగతా బస్సుల్లోనూ అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణించడం లేదు. ఫలితంగా ఆర్టీసీకి భారీ నష్టం వాటిల్లుతోంది.