ముంబయి వంటి ప్రాంతాల నుంచి జగిత్యాల జిల్లాకు వలస కూలీలు తిరిగి వస్తుండటం వల్ల జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మహమ్మారి బారి నుంచి ప్రజలను రక్షించడానికి అధికార యంత్రాంగం సన్నద్ధమైంది.
జగిత్యాల భద్రత... మా బాధ్యత - corona cases in jagtial district
జగిత్యాల జిల్లాకు ముంబయి వంటి పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వలస కార్మికులు వస్తుండటం వల్ల జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా నుంచి జిల్లాను కాపాడుకోవడానికి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే వారిని అధికారులు హోంక్వారంటైన్కు తరలిస్తున్నారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో వారిపై నిఘా ఉంచినట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ సింధుశర్మ తెలిపారు. హోమ్ క్వారంటైన్‌లో ఉండకుండా బయట తిరుగుతున్న 36 మందిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. మాస్కు లేకుండా తిరుగుతున్న 196 మందికి వేయి రూపాయల జరిమానా విధించామని చెప్పారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వివరాలు తమ వద్ద ఉన్నాయని, బయట తిరిగితే కఠిన చర్యలుంటాయని ఎస్పీ సింధుశర్మ హెచ్చరించారు.