జగిత్యాల జిల్లా కలెక్టరేట్ నూతన భవనం నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. 25 ఎకరాల్లో నిర్మించిన ఈ భవనం అన్నిశాఖలు ఒకే చోటు నుంచి పాలన సాగించేలా కార్యాలయాల గదులు, అన్ని వసతులతో నిర్మించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఆర్వోతోపాటు కలెక్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో వివిధశాఖలకు చెందిన 13 శాఖల కార్యాలయాలకోసం గదులను కేటాయించారు. ఇవి కాకుండా సమావేశ మందిరాలు, వీడియో కాన్ఫరెన్స్ గది ఇలా అన్ని అవసరాలకు సరిపోయేలా నిర్మించారు.
ప్రారంభానికి సిద్ధంగా ఉన్న జగిత్యాల కలెక్టరేట్ భవనం - ప్రారంభానికి సిద్ధంగా ఉన్న జగిత్యాల కలెక్టరేట్
పాలనా యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో నూతనంగా ఏర్పడిన అన్ని జిల్లాల్లోనూ కలెక్టరేట్ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జగిత్యాలలో నిర్మించిన కలెక్టరేట్ భవన నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. భవనాన్ని సీఎం కేసీఆర్ గానీ... మంత్రి కేటీఆర్ గాని ప్రారంభించనున్నారు.
జగిత్యాల వార్తలు
మొదటి అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్టు సౌకర్యం కల్పించారు. అన్నిహంగులతో భవన నిర్మాణం పూర్తి చేశారు. భవనం ముందు భాగంలో పూలమొక్కలతో గార్డెన్ ఏర్పాటు చేశారు. వాహనాలు నిలిపేందుకు వీలుగా విశాలవంతమైన పార్కింగ్ వసతి కల్పించారు. ఈ భవనం ప్రారంభమైతే జగిత్యాల జిల్లా ప్రజలకు ఒకే చోట నుంచే అన్ని శాఖలకు సంబంధించిన సేవలు అందుబాటులోకి వస్తాయి.
ఇదీ చూడండి:Vaccine Drive : మహానగరంలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్