విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన 8 మంది సర్పంచులపై జగిత్యాల కలెక్టర్ రవి... చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి, రైతు వేదికల నిర్మాణం, ప్రకృతి వనాల పెంపు తదితర కార్యక్రమాల్లో అలసత్వం ప్రదర్శించిన గ్రామ ప్రథమ పౌరులకు షోకాజ్‌నోటీసులు జారీ చేశారు.
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సర్పంచులకు షోకాజు నోటీసులు - జగిత్యాల వార్తలు
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సర్పంచులపై జిల్లా కలెక్టర్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిది మంది సర్పంచులకు షోకాజ్‌నోటీసులు జారీ చేశారు.
ధర్మపురి మండలం రాజారం, జైనా గ్రామాల సర్పంచులు రంగు మమత, జె.ప్రభాకర్ రావుకు నోటీసులు జారీ చేయగా... రాయికల్ మండలం ధర్మాజీపేట సర్పంచ్ ఎం.స్నేహ, వెల్గటూర్ మండలం గుల్లకోట, చెగ్యాం, వెల్గటూరు సర్పంచులు పి.లావణ్య, ఆర్.లావణ్య, మేరుగు మురళికి షోకాజ్ నోటీసులు అందజేశారు. వారితో పాటు కథలాపూర్ మండలం బొమ్మెన సర్పంచ్ పి.లావణ్య, కోరుట్ల మండలం పైడిమడుగు సర్పంచ్ డి.భీమారెడ్డికి కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సర్పంచులు విధులు సక్రమంగా నిర్వహించి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
ఇదీ చూడండి:బీసీ జాబితాలో కొత్తగా 17 కులాలు.. మొదటి ధ్రువీకరణ పత్రం జారీ