తెలంగాణ

telangana

ETV Bharat / state

మొక్కజొన్న కొనుగోళ్లపై అధికారులతో కలెక్టర్‌ సమీక్ష - తెలంగాణ తాజా వార్తలు

మొక్కజొన్న కొనుగోళ్ల సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పాలనాధికారి కలెక్టర్‌ రవి తెలిపారు. జగిత్యాల కలెక్టరేట్‌లో మొక్కజొన్న కొనుగోళ్లపై వ్యవసాయ, మార్కెటింగ్‌, మార్క్‌ఫెడ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

మొక్కజొన్న కొనుగోళ్లపై అధికారులో కలెక్టర్‌ సమీక్ష
మొక్కజొన్న కొనుగోళ్లపై అధికారులో కలెక్టర్‌ సమీక్ష

By

Published : Oct 29, 2020, 10:54 AM IST

మొక్కజొన్న కొనుగోళ్ల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్​ రవి ఆదేశించారు. మొక్కజొన్న కొనుగోళ్లపై వ్యవసాయ, మార్కెటింగ్​, మార్క్​ఫెడ్​ అధికారులతో జగిత్యాల కలెక్టరేట్​లో సమీక్ష సమావేశం నిర్వహించారు. పంట ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

వ్యవసాయ శాఖ ఆన్​లైన్​లో పొందుపరిచిన పంట విస్తీర్ణం నివేదిక ఆదారంగా జిల్లాలో 31,165 ఎకరాల్లో పంటను సాగుచేశారని తెలిపారు. దిగుబడి 59,207 టన్నులు రావొచ్చని అంచనా వేశామన్నారు. పంటను మద్దతు ధరకు కొలుగోలు చేస్తామని... దళారుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు. గురువారం నుంచి రైతులకు టోకన్లను జారీ చేస్తామన్నారు.

ఇదీ చూడండి:ఇక.. అభయారణ్యాల్లోకీ అనుమతి

ABOUT THE AUTHOR

...view details