ప్రజలకు పాలనను మరింత దగ్గర చేసేందుకు 2016లో తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన, కొత్త భవనాల నిర్మాణాలు కూడా చేపట్టింది. ఇందులో భాగంగా కలెక్టరేట్లోనే అన్ని శాఖల ప్రభుత్వ కార్యాలయాలు ఉండేలా కలెక్టరేట్ భవన సముదాయ నిర్మాణాలను చేపట్టింది. జగిత్యాల జిల్లా ధరూర్ క్యాంపులో 25 ఎకరాల్లో లక్షా రెండువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.33 కోట్ల వ్యయంతో ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయ నిర్మాణం చేపట్టింది.
పూర్తి కావొస్తున్న జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయం - జగిత్యాల జిల్లా వార్తలు
కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత పాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు అన్ని సేవలు ఒకే దగ్గర అందించేందుకు తెలంగాణ సర్కార్ జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయాల నిర్మాణం చేపట్టింది. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా కలెక్టరేట్ భవనం పనులు తుదిదశకు చేరాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే కార్యాలయ భవన సముదాయ ప్రారంభానికి ఏర్పాట్లు చేయనున్నట్టు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం పనులు తుది దశకు చేరాయి. రెండు లిఫ్టులు.. రెండు అంతస్తులతో పాటు.. అన్ని శాఖలకు కార్యాలయాలు, కాన్ఫరెన్స్ హాల్స్.. అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన భవనం సిద్ధమైంది. రంగులు వేయడం పూర్తి కాగా.. రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మరో రెండునెలల్లో పనులు పూర్తవుతాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభానికి సిద్ధం చేయనున్నట్లు జగిత్యాల కలెక్టర్ రవి తెలిపారు. ఒకే దగ్గర అన్ని శాఖల కార్యాలయాలు ఉండడం వల్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకే భవన సముదాయంలో అన్ని పనులు పూర్తి చేసుకునేలా కార్యాలయ సముదాయం ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో బార్లు, క్లబ్బులు తెరిచేందుకు ప్రభుత్వ అనుమతి