కరోనాతో జగిత్యాల అదనపు ఎస్పీ దక్షిణామూర్తి మృతిచెందారు. ఇవాళ ఉదయం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం 5:30 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
కరోనాతో జగిత్యాల అదనపు ఎస్పీ దక్షిణామూర్తి మృతి - jagtial corona news

కరోనాతో జగిత్యాల అదనపు ఎస్పీ దక్షిణామూర్తి మృతి
08:02 August 26
కరోనాతో జగిత్యాల అదనపు ఎస్పీ దక్షిణామూర్తి మృతి
వారం క్రితమే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈనెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. అంతలోనే తనువు చాలించారు.
కరీంనగర్‌కు చెందిన దక్షిణామూర్తి.. ఖమ్మం జిల్లాలో ఎస్సైగా విధుల్లో చేరారు. ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లో పనిచేశారు. అదనపు ఎస్పీగా జగిత్యాల జిల్లాకు బదిలీ అయ్యారు. అతనికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.
Last Updated : Aug 26, 2020, 9:45 AM IST