రానున్న 10 రోజుల పాటు.. ప్రజలంతా ఉదయం 10 గంటలలోపే నిత్యావసరాలను కొనుగోలు చేసి తిరిగి ఇళ్లకు వెళ్లిపోవాలని జగిత్యాల జిల్లా ఎస్పీ సింధూశర్మ కోరారు. జనం స్వచ్ఛందంగా కరోనా కట్టడికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అదనపు ఎస్పీ సురేశ్కుమార్తో కలిసి పట్టణంలో అమలవుతోన్న లాక్‌డౌన్ తీరును పరిశీలించారు.
లాక్‌డౌన్ పరిస్థితిని పరిశీలించిన జిల్లా ఎస్పీ - జగిత్యాల కరోనా వార్తలు
జగిత్యాల జిల్లాలో.. ఉదయం 10 గంటల నుంచి లాక్‌డౌన్ కొనసాగుతోంది. వేకువజామునే ప్రజలు అధిక సంఖ్యలో బయటకు వచ్చి నిత్యావసరాలను కొనుగోలు చేసి తిరిగి వెళ్లిపోయారు. జిల్లా ఎస్పీ సింధూశర్మ పట్టణంలో లాక్‌డౌన్ పరిస్థితిని పరిశీలించారు.
Jagityala lockdown
పట్టణంలో.. ఉదయాన్నే ప్రజలు అధిక సంఖ్యలో బయటకు వచ్చి నిత్యావసరాలను కొనుగోలు చేసి 10 గంటలలోపే తిరిగి వెళ్లిపోయారు. దుకాణాలు మూసి వేయటంతో అంతా నిర్మానుష్యంగా మారిపోయింది. అత్యవసరం ఉన్నవారు మాత్రమే బయటకు వస్తున్నారు. వైద్యశాలలు, బ్యాంకులు, పెట్రోలు బంకులు, మందుల దుకాణాలు మాత్రం తెరిచే ఉన్నాయి.
ఇదీ చదవండి:టీకా తొలి డోసు తీసుకున్నాక కరోనా వస్తే?