తెలంగాణ

telangana

ETV Bharat / state

'కాళేశ్వరంపై ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం' - Congress party

ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోత్తల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు విమర్శలు చేయటం మానుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వెల్లడించారు.

'కాళేశ్వరంపై ప్రతిపక్షాల అనవసర రాద్ధాంతం'

By

Published : Aug 11, 2019, 10:00 PM IST

కాళేశ్వరం పథకంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అబద్ధాలు చెప్పుతున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ విమర్శించారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టును నిర్మిస్తే సగం నిధులతోనే ప్రాజెక్టు నిర్మించవచ్చునని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. అసలు అక్కడ నీటి లభ్యత లేదని జలమండలి ఇచ్చిన నివేదిక ఆధారంగా మేడిగడ్డ వద్ద ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మించిందని స్పష్టం చేశారు. మరో 10 రోజుల్లో వరద కాలువపై నిర్మించిన పునర్ జీవ పథకం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ఎస్సారెస్పీ నుంచి కోదాడ వరకు సస్యశ్యామలం అవుతుందని వెల్లడించారు.

'కాళేశ్వరంపై ప్రతిపక్షాల అనవసర రాద్ధాంతం'

ABOUT THE AUTHOR

...view details