రాష్ట్రంలోని పేదలను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ రెండు పడక గదుల ఇళ్లను ఇస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తెలిపారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్‌లో పేదల కోసం నిర్మించిన 25 రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు జడ్పీ ఛైర్పర్సన్ వసంతతో కలిసి పంపిణీ చేశారు.
'ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారు' - mla haritha haaram
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్‌లో లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇళ్లను జడ్పీ ఛైర్పర్సన్ వసంతతో కలిసి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పంపిణీ చేశారు. రాష్ట్రంలోని ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
!['ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారు' jagityala mla kalvakuntla vidhyasagar rao distributed double bed room houses](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8140623-846-8140623-1595497014499.jpg)
jagityala mla kalvakuntla vidhyasagar rao distributed double bed room houses
అనంతరం గ్రామంలో నిర్వహించిన హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. రాష్ట్రంలోని ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. పచ్చదనం ఉంటేనే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారని ఎమ్మెల్యే వివరించారు.