తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుదాఘాతంతో దంపతుల మృతి - విద్యుత్‌ సరఫరా

విద్యుదాఘాతంతో దంపతులు మరణించిన ఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలో చోటుచేసుకుంది. తల్లిదండ్రులను కోల్పోయిన కుటుంబం రోడ్డున పడింది.

విద్యుదాఘాతంతో దంపతుల మృతి

By

Published : Aug 3, 2019, 10:50 AM IST

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో విద్యుదాఘాతంతో దంపతులు మృతిచెందారు. గ్రామానికి చెందిన ఆసరి గంగాధర్‌ వ్యవసాయ పనులను ముగించుకుని ఇంటికి వచ్చి దుస్తులు మార్చుకునే క్రమంలో దుస్తులుకున్న తీగకు విద్యుత్‌ సరఫరా జరిగి ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురైయ్యాడు. అది గమనించిన గంగాధర్‌ భార్య లక్ష్మి తన భర్తను కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. వీరికి ముగ్గురు సంతానం. తల్లిదండ్రుల మరణంతో వారు కన్నీరుమన్నీరయ్యారు.

విద్యుదాఘాతంతో దంపతుల మృతి

ABOUT THE AUTHOR

...view details