జగిత్యాల జిల్లాలో లాక్డౌన్ను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు.. కఠిన నిబంధనలు తీసుకొచ్చినట్లు జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. వాహనదారులు మూడు కిలోమీటర్ల కంటే దూరం దాటి వెళ్లరాదని... అనవసరంగా బయటకి తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే నిబంధనలు పాటించని 97 వాహనాలు స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. వారిని జైలుకు కూడా పంపుతామన్నారు.
మూడు కిల్లోమీటర్లు దాటితే జైలే: ఎస్పీ సింధు శర్మ - Jagityala district SP Sindhu sharma talk about Lockdown
లాక్‌డౌన్ నేపథ్యంలో అడ్డగోలుగా రోడ్లపై తిరిగేవారిని కట్టడి చేసేందుకు జగిత్యాల జిల్లా పోలీసుశాఖ కొత్త అస్త్రం సిద్ధం చేసింది. నిబంధనలు అతిక్రమించి మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
![మూడు కిల్లోమీటర్లు దాటితే జైలే: ఎస్పీ సింధు శర్మ jagityala-district-sp-sindhu-sharma-talk-about-lockdown](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6751438-823-6751438-1586604940985.jpg)
మూడు కిల్లోమీటర్లు దాటితే జైలే: ఎస్పీ
ఎవరు కూడా నిబంధనలు అతిక్రమించరాదని వాహనదారులను హెచ్చరించారు. రైతులకు మినహాయింపు ఉంటుందని తెలిపారు. జిల్లాలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటం వల్ల జిల్లా సరిహద్దుల్లో మరింత భద్రత పెంచామని పేర్కొన్నారు.