తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రత్యేక బడ్జెట్​ ప్రకటించటంపై ఆర్టీసీ ఉద్యోగుల హర్షం - Telangana Latest News

జగిత్యాల జిల్లా మెట్​పల్లి ఆర్టీసీ డిపోలో ఉద్యోగులు సంబురాలు జరుపుకున్నారు. ఆర్టీసీ సంక్షేమం కోసం ప్రత్యేక బడ్జెట్​ ప్రకటించడాన్ని స్వాగతించారు. సీఎం కేసీఆర్​, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చిత్రపటాలకు అభిషేకం చేశారు.

ప్రత్యేక బడ్జెట్​ ప్రకటించటంపై ఆర్టీసీ ఉద్యోగుల హర్షం
ప్రత్యేక బడ్జెట్​ ప్రకటించటంపై ఆర్టీసీ ఉద్యోగుల హర్షం

By

Published : Mar 18, 2021, 8:10 PM IST

ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించడం అభినందనీయమని జగిత్యాల మెట్​పల్లి డిపో మేనేజర్ విజయ రావు అన్నారు. బడ్జెట్​ను అసెంబ్లీలో ప్రకటించడాన్ని స్వాగతిస్తూ డిపోలో ఉద్యోగులు సంబురాలు జరుపుకున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​తో పాటు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చిత్రపటాలకు ఉద్యోగులు అభిషేకం చేశారు. ఇదే స్ఫూర్తితో ఆర్టీసీని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలన్నారు. తమకు అండగా నిలవాలని కోరారు.

ఇదీ చూడండి:ప్రజలకిచ్చిన ప్రతిమాట నిలబెట్టుకునేలా బడ్జెట్‌ రూపకల్పన: హరీశ్‌రావు

ABOUT THE AUTHOR

...view details