తెలంగాణ

telangana

ETV Bharat / state

కన్నాపూర్​లో వరికోత యంత్రాలపై సర్పంచ్​ పన్ను

నిబంధనలకు విరుద్ధంగా జగిత్యాల జిల్లా కన్నాపూర్​ సర్పంచ్​ వరికోత యంత్రంపై పన్ను విధించారు. రైతుల ద్వారా విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్​ గుగులోతు రవి సర్పంచ్​కి షోకాజ్​ నోటీసులు జారీ చేశారు.

By

Published : Apr 14, 2020, 10:16 PM IST

Jagityala Collector showcause notices to Kannapur Sarpanch
​ సర్పంచ్​కు కలెక్టర్ షోకాజ్​ నోటీసులు ​

వరి కోతలు సజావుగా సాగేందుకు ప్రభుత్వం వరికోత యంత్రాలను ప్రొత్సహిస్తుంటే.. జగిత్యాల జిల్లా కన్నాపూర్‌ గ్రామ సర్పంచ్​ మాత్రం ఊళ్లో వరి కోతలు కోయాలంటే రెండు వేల పన్ను కట్టించుకున్నాడు. వాస్తవానికి వరి కోత యంత్రానికి గ్రామ పంచాయతీలు ఎటువంటి పన్ను వేయరాదు.

జగిత్యాల రూరల్‌ ఠాణాలో సర్పంచ్​ కొక్కు సుధాకర్‌పై కొందరు రైతులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇదిలా ఉండగా జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి ఈ వ్యవహారంపై సర్పంచ్​కు షోకాజ్​ నోటిసులు జారీ చేశారు.

ఇదీ చూడండి:-'లాక్​డౌన్​ లేకపోతే మన పరిస్థితి ఎలా ఉండేదో?'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details