జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణం చావిడి ప్రాంతంలోని ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల ప్రమాదకరంగా మారింది. పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులపై పడుతున్నాయి. గత 10 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు గోడల పైకప్పు తడిచి పోయాయి. రెండు రోజులు సెలవు రావడం వల్ల సోమవారం పాఠశాల తెరిచి తరగతి గదులలో ఉపాధ్యాయులు బోధన ప్రారంభించిన కొద్ది సేపటికే పెచ్చులు ఊడి విద్యార్థులపై పడటం వల్ల గది నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. దీంతో విద్యార్థులను మరో గదిలోకి పంపించారు. పాఠశాలకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ప్రమాదకరంగా మారిన పాఠశాల - జగిత్యాల జిల్లా
ప్రభుత్వ పాఠశాలలు ప్రమాద స్థాయికి చేరాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పాఠశాల విద్యార్థులు భరోసాలేని చదువులు చదువుతున్నారు.
ప్రమాదకరంగా మారిన పాఠశాల