అదృష్టమంటే ఇదేనేమో: జగిత్యాల వాసికి దుబాయ్‌లో రూ.30 కోట్ల లాటరీ.. - దుబాయ్‌లో లాటరీ కొట్టిన జగిత్యాల వ్యక్తి
Rs.30 Crores Lottery : జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం తుంగూరు గ్రామానికి చెందిన అజయ్ అనే యువకుడికి లాటరీలో రూ.30 కోట్లు వరించాయి. 4 సంవత్సరాల క్రితం దుబాయ్‌కి వెళ్లిన అజయ్.. ఓ కంపెనీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రూ.30 ధిరమ్స్‌తో రెండు లాటరీ టిక్కెట్లు కొన్న అతను.. రూ.15 మిలియన్ల ధరమ్స్ గెలుచుకున్నాడు. వాటి విలువ భారత్‌లో రూ.30 కోట్లు ఉంటుందని ఆ యువకుడు తెలిపాడు. లాటరీలో గెలుచుకున్న డబ్బును చెక్కు రూపంలో దుబాయ్‌లో అందుకున్నాడు. యువకుడుకి అదృష్టం వరించడంతో తుంగూరు గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జగిత్యాల కుర్రాడికి లాటరీ