తెలంగాణ

telangana

ETV Bharat / state

'కూరగాయల మార్కెట్​ను త్వరగా​ ఏర్పాటు చేయండి' - మెట్​పల్లి పురపాలక సంఘం

జగిత్యాల కలెక్టర్ రవి.. మెట్​పల్లి పురపాలక సంఘంలో పర్యటించారు. కూరగాయల మార్కెట్​ నిర్మాణానికి శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్నా.. పనులు పూర్తి కాకపోవడంపై అధికారులను ప్రశ్నించారు.

Jagitya Collector Ravi visisted MetPalli municipality.
మెట్​పల్లిలో కలెక్టర్​ పర్యటన

By

Published : Mar 5, 2021, 3:49 PM IST

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కూరగాయల మార్కెట్​ ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలని జగిత్యాల కలెక్టర్ రవి.. అధికారులను ఆదేశించారు. మెట్​పల్లి పురపాలక సంఘంలో ఏర్పాటు చేయనున్న మార్కెట్ స్థలాన్ని ఆయన పరిశీలించారు.

మార్కెట్​ నిర్మాణానికి శంకుస్థాపన చేసి 8 నెలలు గడుస్తున్నా.. పనులు పూర్తి కాకపోవడంపై అధికారులను ప్రశ్నించారు కలెక్టర్. కూరగాయల మార్కెట్​తో పాటు మాంసం మార్కెట్​ను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. అందుకోసం త్వరలోనే స్థలాన్ని కేటాయిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:ఆ ఊరంతా జాతీయ స్థాయి ఆటగాళ్లే!

ABOUT THE AUTHOR

...view details