జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల సర్వ సభ్య సమావేశానికి మాస్కు లేకుండా హాజరైన పశువైద్య అధికారికి రూ.వేయి జరిమాన విధించారు. అదే సమయంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాస్కు ధరించకుండా హాజరయ్యారు.
మాస్క్ లేదని వైద్యాధికారికి జరిమానా.. మరి ఎమ్మెల్యేకి? - Jagittala district Kodimyala officials did not take any action against the MLA didn't wearing mask
ఓ సమావేశానికి హాజరైన అధికారికి మాస్కు లేదని ఫైన్ వేసి.. అదే కార్యక్రమానికి మాస్కు లేకుండా పాల్గొన్న ఎమ్మెల్యేపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు అధికారులు. చివరికి అది గమనించిన శానసభ్యుడు మాస్కు ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో జరిగింది.
మాస్కులేదని ఓ అధికారికి జరిమానా.. ఎమ్మెల్యేకు ఏం చెప్పలేని స్థితి
కానీ దీనిపై మండల ప్రజాప్రతినిధులు, అధికారులు ఏమి చెప్పలేకపోయారు. ఇదే సమావేశంలో జిల్లా పరిషత్తు అధ్యక్షురాలు దావ వసంత మాస్కు ధరించి వేదికపై కూర్చున్నారు. చివరికి ముఖ్యమంత్రి సహాయనిధి అందించే సమయంలో ఎమ్మెల్యే మాస్కు ధరించారు.
ఇవీ చూడండి:గేటెడ్ కమ్యూనిటీల్లో కరోనా చికిత్స