అమెరికా అధ్యక్ష పదవి రేసులో బైడన్ ముందంజలో ఉండటం ఆనందదాయకంగా ఉందని, అమెరికాలో హిందూ సంస్కృతి, ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుందని అమెరికాలో నివసిస్తున్న జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందినవేదపండితులు చంద్రశేఖర్శర్మ అభిప్రాయపడ్డారు. శుక్రవారం అమెరికా నుంచి 'ఈటీవీ భారత్'తో మాట్లాడారు. గతంలో 2003 మే నెలలో విలియం సిటీలో మహాలక్ష్మి ఆలయం కుంభాభిషేక కార్యక్రమానికి బైడన్ సెనేట్గా హాజరుకాగా ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.
'బైడన్ అధ్యక్షతన అమెరికాలో హిందూ సంస్కృతి వెల్లివిరుస్తుంది'
అగ్రరాజ్య అధ్యక్ష పదవి రేసులో బైడన్ ముందంజలో ఉండటంపై అమెరికాలో నివసిస్తున్న జగిత్యాల జిల్లాకు చెందిన వేదపండితులు చంద్రశేఖర్శర్మ ఆనందం వ్యక్తం చేశారు. బైడన్ అధ్యక్షతన అమెరికాలో హిందూ సంస్కృతి వెల్లివిరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
'బైడన్ అధ్యక్షతన అమెరికాలో హిందూ సంస్కృతి వెల్లివిరుస్తుంది'
రెండు దశాబ్దాల కింద యజుర్వేదం అధ్యయనం చేసి డబ్లిన్ సిటీలో పూజారిగా స్థిరడినట్లు పేర్కొన్నారు. తాను మొదట విలివెంట్ సిటీలోని మహాలక్ష్మి ఆలయంలో పూజారిగా చేరానని ఆ సమయంలో సెనేట్గా బైడన్ కుంభాభిషేక ఉత్సవాల్లో పాల్గొన్నారని అన్నారు. భారత సంస్కృతి, సంప్రదాయాల పట్ల అమితమైన గౌరవముందని సంప్రదాయాలు, వేదాలు, పురాణాలపై ఆసక్తికనబరిచేవారని అన్నారు.
ఇదీ చదవండిఃకాస్త.. ఓపిక పట్టండి విజయం మనదే: బైడెన్