జగిత్యాల అర్బన్ ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. కో ఆప్షన్ సభ్యుని ఎన్నిక కోసం ఉదయం 10 గంటలకు ఒక్క నామినేషన్ దాఖలు కానందున ఎన్నికల అధికారులు పరిషత్ పరోక్ష ఎన్నికను వాయిదా వేశారు. జగిత్యాల అర్బన్ మండలం ఎంపీపీ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు చేశారు. మండలంలో మొత్తం 4 స్థానాలు ఉండగా... ఒకటి కాంగ్రెస్, ఒక స్వతంత్రులు, 2 తెరాస స్థానాల్లో తెరాస గెలుపొందింది. కాంగ్రెస్ సభ్యురాలు వనితకు ఎంపీపీ దక్కే అవకాశం ఉన్నా... ఇద్దరు బలపరచాల్సి ఉంది. రిజర్వు అయిన సామాజిక వర్గానికి చెందిన వారు ఒకరే ఉండటంతో అధికారులు ఈసీకి లేఖ రాశారు. ఏం చేయాలో తెలపాలని లేఖలో పేర్కొన్నారు. ఎస్సీ మహిళను అయినందునే తెరాస నాకు సహకరించట్లేదని... కాంగ్రెస్ అభ్యర్థి కవిత చెబుతున్నారు.
జగిత్యాల అర్బన్ ఎంపీపీ ఎన్నిక వాయిదా - JAGITIAL MPP ELECTION POSTPONED
జగిత్యాల అర్బన్ ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. కో ఆప్షన్ సభ్యుని ఎన్నిక కోసం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడమే ఇందుకు కారణం.
జగిత్యాల అర్బన్ ఎంపీపీ ఎన్నిక వాయిదా