తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాలలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే - పంట నష్టం

జగిత్యాలలో అకాల వర్షం అన్నదాతలకు కన్నీటిని మిగిల్చింది. వరి, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దెబ్బతిన్న పంటలను స్థానిక ఎమ్మెల్యే సంజయ్​కుమార్​ పరిశీలించారు.

ఎమ్మెల్యే

By

Published : Mar 21, 2019, 8:26 PM IST

దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే
జగిత్యాల మండలం జబితాపూర్‌, ధర్మారం, లక్ష్మీపూర్‌ గ్రామాల్లో అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ పరిశీలించారు. విరిగిన మామిడి చెట్లు, పడిపోయిన వరి పంటల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. నష్టాలపై ఆరా తీశారు.

అన్ని విధాలా ఆదుకుంటాం..

వర్షం వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అధైర్యపడవద్దని భరోసానిచ్చారు.

ఇవీ చూడండి :20 గంటలవుతున్నా కరగని వడగళ్లు

ABOUT THE AUTHOR

...view details