జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ గుగులోత్ రవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో జరుగుతున్న భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం పలువురు రైతులకు పాసు పుస్తకాలు, రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా ప్రజలకు పారదర్శకంగా, సులభతరంగా సేవలు అందుతాయని కలెక్టర్ వివరించారు.
మెట్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ రవి ఆకస్మిక తనిఖీ - jagitial collector on dharani portal
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, ఆస్తి మార్పిడిలో సత్వర సేవలను అందించేందుకే ప్రభుత్వం ధరణి పోర్టల్ ప్రవేశపెట్టిందని జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోత్ రవి అన్నారు. మెట్పల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆయన రైతులకు పాసు పుస్తకాలు, రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు.
మెట్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ రవి ఆకస్మిక తనిఖీ
జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లకు పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియను ప్రారంభించామని గుగులోత్ రవి తెలిపారు. భూముల క్రయవిక్రయాలు, లావాదేవీలు బయోమెట్రిక్ ఆధారంగా జరుగుతున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 186 మీ-సేవ కేంద్రాలున్నాయని.. ఆయా కేంద్రాల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సేవలు పొందవచ్చని ఆయన వివరించారు.