భాజపా ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ మండి పడ్డారు.
భాజపా ఎంపీలు తప్పుడు ప్రకటనలు మానుకోవాలి: ఎమ్మెల్యే సంజయ్
బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆరోపించారు. తప్పుడు ప్రకటనలు మానుకోవాలని సూచించారు.
'బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌లు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు'
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం 290కోట్లు ఇస్తే... 7వేల కోట్లు ఇచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి తప్పుడు ప్రకటనలు మానుకోవాలని సూచించారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధికి పాటు పడి... ఇలాంటి ప్రకటనలు మానుకుంటే బాగుంటుందని ఎమ్మెల్యే హితవు పలికారు.
ఇదీ చదవండి :కేటీఆర్ అబద్ధాలు చెప్పుడు మానాలి : ఎంపీ అర్వింద్