తెలంగాణ

telangana

ETV Bharat / state

మిషన్ భగీరథను వేగవంతం చేయండి: కలెక్టర్ - misson bhagiratha works in towns

జగిత్యాల జిల్లాలో పట్టణాల్లో నడుస్తున్న మిషన్ భగీరథ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని కలెక్టర్ రవి ఆదేశించారు. జిల్లాలోని జగిత్యాల, మెట్టుపల్లి, కోరుట్ల, పురపాలక పరిధిలో మిషన్ భగీరథ పనులను పరిశీలించారు. రాబోయే వేసవిలోగా పనులు పూర్తి చేసేలా ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు.

Mission Bhagiratha works in towns should be expedited - Collector
పట్టణాల్లో మిషన్ భగీరథ పనులు వేగవంతం చేయాలి –కలెక్టర్

By

Published : Nov 18, 2020, 5:57 PM IST

జగిత్యాల జిల్లాలో పట్టణాల్లో నడుస్తున్న మిషన్ భగీరథ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని కలెక్టర్ రవి ఆదేశించారు. జగిత్యాల, కోరుట్ల,మెట్పల్లి మున్సిపల్ లో చేపడుతున్న అర్బన్ మిషన్ భగీరథ పనులను వేసవి కాలంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీలలో చేపడుతున్న పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.జగిత్యాల మున్సిపల్ పరిధిలో నిర్మిస్తున్న మంచి నీటి ట్యాంకును, సంపూ, ఫిల్టర్ బెడ్, ఎలివెటెడ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను పరిశీలించారు. ప్రమాణాలు పాటిస్తూ, లోటుపాట్లు లేకుండా రాబోయో వేసవి కాలంలోగా పనులు పూర్తియాలని తెలిపారు.

ఉప్పరిపేట, యాదవనగర్ లో పైపులైన్ పనులను పరిశీలించారు. లీకేజి సమస్యలు తెలత్తకుండా చూడాలన్నారు. కొత్తబస్టాండ్, నిజామాబాద్ రోడ్డు, ధర్మపురి రోడ్డు లో పైప్ లైన్ క్రాసింగ్ కోసం జాతీయ రహదారి వారితో మాట్లాడి పనులకు ఆటంకం లేకుండా చూస్తామన్నారు.కోరుట్ల మున్సిపల్ పరిధిలో నిర్మాణ పనులను పరిశీలించారు. జాతీయ రహదారి వద్ద చేపట్టాల్సిన పనులకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా పూర్తిచేయాలన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అల్లమయ్య గుట్ట వద్ద నిలిచి పోయిన పనులను తిరిగి ప్రారంభించాలని సూచించారు. పైపులైన్ నిర్మాణాల్లో కచ్చితమైన ప్రమాణాలను పాటిస్తూ, లీకేజి ఇతర సమస్యలు తలెత్తకుండా పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం మక్కకొనుగోలు పై అధికారులను ఆరాతీసారు.

మెట్ పల్లి మున్సిపల్ పరిధిలోని నిర్మిస్తున్న వాటర్ ట్యాంకుల పనుల పురోగతిపై అధికారులను ఆరా తీశారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. నిర్మాణ పనుల్లో ఎదురైన భూసమస్యలను వారంలోగా పరిష్కరిస్తామని తెలిపారు.

ఇవీ చదవండి: ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనం ఢీ.. ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details