ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతుంటే.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ధర్మారం సర్కారు బడిలో చేరికలకై చుట్టూ పక్కల గ్రామాల విద్యార్థుల పోటీ పడుతున్నారు. ఈ ప్రాథమిక బడిలో ఉపాధ్యాయులందరూ యువకులే. వీరంతా విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి ధర్మారంకు విద్యార్థుల రాక ఎక్కువైంది. ఇక్కడి ఉపాధ్యాయుల కృషి వల్ల.. జవహర్ నవోదయలో ఇక్కడి విద్యార్థులు సీట్లు సాధిస్తూ సర్కారు బడి నాణ్యతను చాటి చెబుతున్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు కొరత ఉన్నందున గ్రామస్థులే విద్యా వాలంటీర్లను నియమించి 5వేల వేతనం అందజేస్తున్నారు.
సర్కారుకు సై.... ప్రైవేటుకు.. నై...!
సర్కార్ బడి అంటే కురిసే పైకప్పు, బీటలు వారిన గోడలు, రోజూ రాని ఉపాధ్యాయులు.. ఇవి ఒక్కప్పటి అభిప్రాయం. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రైవేటు పాఠశాలల కంటే దీటుగా విద్యను భోదిస్తున్నాయి.
సర్కారుకు సై.... ప్రైవేటుకు.. నై...!