జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ఇంటర్మీడియట్ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. నాలుగు మండలాల్లోని పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. 9 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయగా... 3397 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
మొదటి రోజు ప్రశాంతంగా సాగిన ఇంటర్ పరీక్ష - INTER EXAMS 2020
ఇంటర్ వార్షిక పరీక్షల్లో భాగంగా మొదటి సంవత్సరం మొదటి పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన 9 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
INTER EXAMS STARTED IN JAGITYAL
కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు నిమిషం ఆలస్యమైనా... అనుమతించరన్న నిబంధన వల్ల విద్యార్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరం పరీక్షా కేంద్రంలోకి అధ్యాపకులు అనుమతించారు.