జగిత్యాల జిల్లా మెట్పల్లి డిపో వద్ద ఆర్టీసీ మహిళా ఉద్యోగులు దీక్ష చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం మొండి వైఖరిని వీడి తమ సమస్యను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మెట్పల్లి డిపో వద్ద మహిళా ఉద్యోగుల దీక్ష - జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్టీసీ డిపో వద్ద మహిళా ఉద్యోగులు ఆందోళన చేపట్టారు
ఆర్టీసీ కార్మికుల సమ్మె 20వ రోజు ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్టీసీ డిపో వద్ద మహిళా ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.

మెట్పల్లి డిపో వద్ద మహిళా ఉద్యోగుల దీక్ష
మెట్పల్లి డిపో వద్ద మహిళా ఉద్యోగుల దీక్ష