తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ కార్యాలయం..ప్రశాంతతకు నిలయం - latest news on impressive muncipal office at korutla in jagtial district

అందమైన బొమ్మల చిత్రాలతో, ఆహ్లాదకరమైన వాతావరణంతో, గోడల నిండా స్ఫూర్తినిచ్చే సూక్తులతో అక్కడి పురపాలక సంఘ కార్యాలయం ఆకట్టుకుంటోంది. అక్కడికివెళ్తే.. మనసు ప్రశాంతతతో పాటు కాసేపు గడపాలనిపిస్తుంది. అసలు ఆ కార్యాలయం ఏంటో.. అది ఎక్కడ ఉందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

impressive muncipal office at korutla in jagtial district
ప్రభుత్వ కార్యాలయం..ప్రశాంతతకు నిలయం

By

Published : Mar 7, 2020, 1:29 PM IST

జగిత్యాల జిల్లా కోరుట్లలోని పురపాలక సంఘ కార్యాలయం పచ్చని చెట్లు, గోడలపై అందమైన చిత్రాలతో అందరినీ ఆకట్టుకుంటోంది. పురపాలక కమిషనర్ అయాజ్​​ ప్రత్యేక దృష్టి సారించి.. కార్యాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. కార్యాలయం లోపల, బయట వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. గోడల నిండా రంగురంగుల బొమ్మలతో ప్రజలను ఆకట్టుకుంటూ.. కార్యాలయానికి వచ్చేవారికి ఆహ్లాదాన్ని పంచుతున్నారు.

పచ్చని చెట్లను పెంచుదాం-పర్యావరణాన్ని కాపాడుదాం, ఇంకుడు గుంతలు నిర్మిద్దాం-నీటిని పొదుపుగా వాడుకుందాం లాంటి సూక్తులను గోడలపై రాయించి.. పచ్చదనం, పరిశుభ్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వివిధ అవసరాల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలు కార్యాలయ గోడలను.. పచ్చని చెట్లను చూస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పచ్చని చెట్ల కింద సేదతీరుతూ ఉపశమనం పొందుతున్నారు.

పర్యావరణం, పరిశుభ్రత పట్ల ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకే కార్యాలయాన్ని ఇలా అందంగా తీర్చిదిద్దినట్లు పురపాలక కమిషనర్​ అయాజ్​ పేర్కొన్నారు. భవిష్యత్తుల్లో పట్టణంలోని ఇంటింటికీ చెట్లను పంపిణీ చేసి.. పట్టణంలో పచ్చదనం.. పరిశుభ్రత మరింత మెరుగుపడేలా చేస్తామని తెలిపారు.

ప్రభుత్వ కార్యాలయం..ప్రశాంతతకు నిలయం

ఇదీ చూడండి:బిహార్​లో ఘోర రోడ్డు ప్రమాదం-12మంది మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details