తెలంగాణ

telangana

ETV Bharat / state

Food Poisoning : కలుషిత ఆహారం తిన్న 40 మంది బాలికలకు అస్వస్థత - జగిత్యాలలో బాలికల వసతిగృహం

Illness for 40 girls, food poising
కలుషిత ఆహారం తిని అస్వస్థత

By

Published : Dec 14, 2021, 8:13 AM IST

Updated : Dec 14, 2021, 9:12 AM IST

08:06 December 14

Food Poisoning : బీసీ సోషల్ వెల్ఫేర్ వసతిగృహంలో భోజనం చేసిన బాలికలు

Illness For 40 Girls: జగిత్యాల భవానినగర్​లోని బీసీ సోషల్ వెల్ఫేర్‌ వసతిగృహంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి భోజనం తిని పడుకున్న విద్యార్థులు.. ఉదయం వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది అస్వస్థతకు గురైన వారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మొత్తం 400 మంది విద్యార్థులు భోజనం చేయగా.. వారిలో 40 మంది అస్వస్థతకు గురయ్యారు. కొందరికి ప్రాథమిక చికిత్స అందించి వసతి గృహానికి తరలించారు. మరికొందరికి ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదని ప్రిన్సిపాల్ సునీత తెలిపారు.

Last Updated : Dec 14, 2021, 9:12 AM IST

ABOUT THE AUTHOR

...view details