జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల, కమలాపూర్ గ్రామాల్లో పట్టణ ప్రగతి అభివృద్ధి పనులను పల్లె ప్రగతి రాష్ట్ర ప్రత్యేకాధికారి,వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మిస్తున్న స్మశానవాటికలు, డంపింగ్ యార్డు నిర్మాణ పనులను పరిశీలించారు.
ధర్మపురి మండలంలో ఐజీ స్టీఫెన్ రవీంద్ర పర్యటన - జగిత్యాల జిల్లా
పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులును ప్రణాళికబద్ధంగా చేపట్టాలని వెస్ట్ జోన్ ఐజీ, పల్లె ప్రగతి రాష్ట్ర ప్రత్యేకాధికారి స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాలో పట్టణ ప్రగతి అభివృద్ధి పనులను పర్యవేక్షించారు
ధర్మపురి మండలంలో పర్యటించిన వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర
పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన ప్రత్యేక నిధులను ప్రణాళికబద్ధంగా వినియోగించుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి:బిహార్లో ఘోర రోడ్డు ప్రమాదం-12మంది మృతి