Hyderabad Candidates Eye on Migrant Voters : ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వినియోగంపై ఇప్పటికేఅవగాహన ఉన్నప్పటికి.. ఆ ఓటును ఎక్కడ వేస్తారన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అదేంటి ఓటర్లు తమకు కేటాయించిన పోలింగ్ బుత్లోనే కదా ఓటు వేసేది అనుకుంటున్నారా.. అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. నగరంలో ఎక్కవ మంది వివిధ ప్రాంతాల (Migrant Voters) నుంచి వచ్చి సెటిల్ అయినవారే ఉన్నారు. హైదరాబాద్ నగరం ఎందరికో ఉపాధినిచ్చింది.. ఉండటానికి నీడ నిచ్చింది. నగరంలో ఉంటున్నవారికి దీనిపై ఎంత ప్రేమ ఉన్నా.. స్వస్థలంతో వారికి ఉన్న అనుబంధం వేరె. ఇప్పుడదే ఎన్నికల బరిలో ఉన్న నగర అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తుంది. ఎన్నికల్లో నగరంలో స్వల్ప మెజార్టీలే నమోదవుతున్న వేళ ఇక్కడ ఉన్న ఓటర్లు ఇక్కడే ఉంటారా లేదా స్వస్థలానికి వెళ్లి అక్కడ కూడా ఉన్న ఓటును వినియోగించుకుంటారా అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశమైంది.
తెలంగాణ ఎన్నికల్లో యువత ఓటే కీలకం
City Outskirts Migrant Voters : ఉప్పల్, ఎల్బీ నగర్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్తో పాటు నగరంలోని సగానికి పైగానియోజకవర్గాల్లో నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్, జనగామ, సిద్ధిపేట, కరీంనగర్ ఇలా తెలంగాణలోని చాలా ప్రాంతాల నుంచి వచ్చి నగరంలో స్థిరపడ్డారు. వీళ్లలో చాలా మందికి సొంత నియోజకవర్గంలోనూ ఓటు హక్కు ఉంది. నగరంలో వీరు నివాసం ఉంటున్న చోటా ఓటరుగా (Telangana Elections 2023) నమోదై ఉన్నారు. వీరికి స్వస్థలంపై మనసు మళ్లితే మా పరిస్థితి ఏంటని నగర అభ్యర్థులు యోచిస్తున్నారు. నగరంలోనే ఓటేసేలా వారిని చూడాలని తగ్గట్టు ప్రచారాలు చేయాలని తమ అనుచరులకు సూచిస్తున్నారు. తప్పకుండా ఇక్కడే ఉండి.. మాకు ఓటు వేయాలని అభ్యర్థులు ప్రచారంలో కోరుతున్నారు.
చట్టసభలో మహిళలకు దక్కని అవకాశం - తెలంగాణ ఎన్నికలో మహిళలకు ఎన్ని సీట్లో తెలుసా?