కొండగట్టుపై కరోనా ప్రభావం..తగ్గిన హుండీ ఆదాయం - ఆంజనేయస్వామి ఆలయం హుండీ లెక్కింపు
కరోనా ప్రభావం కొండగట్టు ఆంజనేయ స్వామిపైనా పడింది. భక్తులు దర్శనాలు తక్కువ కావడం వల్ల... ఆదాయం కూడా తగ్గింది. ఈవో, భద్రత సిబ్బంది సమక్షంలో హుండీ లెక్కించగా... రూ.31,64,895లు మాత్రమే వచ్చాయి.
![కొండగట్టుపై కరోనా ప్రభావం..తగ్గిన హుండీ ఆదాయం hundi counting in kondagattu anjaneya swamy temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8916137-thumbnail-3x2-hundi.jpg)
కొండగట్టు అంజన్న హుండీ లెక్కింపు.. తగ్గిన ఆదాయం
జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ హుండీ లెక్కించారు. రూ.31,64,895ల కానుకల వచ్చినట్టు ఈవో చంద్రశేఖర్ తెలిపారు. 49 గ్రాముల బంగారం, 2కిలోల వెండి భక్తులు సమర్ఫించినట్టు వెల్లడించారు. కరోనా కారణంగా స్వామివారికి కానుకలు తగ్గిపోయినట్టు ఈవో వివరించారు.