జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. 21రోజుల్లో రూ.40 లక్షల 20 వేల 754 నగదు, 8 గ్రాముల బంగారం, కిలో 600 గ్రాముల వెండి, 48 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు.
కొండగట్టు అంజన్న ఆలయంలో హుండీ లెక్కింపు - కొండగట్టు అంజన్న ఆలయం వార్తలు
కొండగట్టు అంజన్న ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. 21 రోజులకు రూ.40,20,754 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. పటిష్ఠ భద్రత నడుమ లెక్కించామని స్పష్టం చేశారు.
కొండగట్టు అంజన్న ఆలయం, అంజన్న ఆలయంలో హుండీ లెక్కింపు
హుండీ లెక్కింపు సందర్భంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పటిష్ఠ భద్రత మధ్య లెక్కించినట్లు ఈవో స్పష్టం చేశారు. ఏప్రిల్ నెలలో చిన్నహనుమాన్ జయంతి వేడుకలకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని.. హుండీ ఆదాయం భారీగా పెరగనుందని తెలిపారు.
ఇదీ చూడండి: బ్యాంకులో చోరీకి గురైన సొమ్ము విలువ రూ.3.10 కోట్లు: సీపీ