జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టినట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. 20 రోజులకు గాను రూ.47 లక్షల 10 వేలు, 35 గ్రాముల బంగారం వచ్చినట్లు వెల్లడించారు.
కొండగట్టు అంజన్న ఆలయంలో హుండీ లెక్కింపు - జగిత్యాల జిల్లా తాజా వార్తలు
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. 20 రోజులకుగాను రూ.47 లక్షల 10 వేలు వచ్చినట్లు ఆలయ ఈవో తెలిపారు.

కొండగట్టు అంజన్న ఆలయంలో హుండీ లెక్కింపు
1,650 గ్రాముల వెండి, 8 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు ఈవో చెప్పారు. భారీ భద్రత మధ్య హుండీ లెక్కింపు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చిన సొమ్మును బ్యాంకులో జమ చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:నేటి అర్ధరాత్రి నుంచి నాగోబా జాతర