నాగుల పంచమి సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో నాగదేవత ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేకువ జాము నుంచే మహిళలు పాముల పుట్ట వద్దకు చేరుకుని నాగదేవతకు ప్రత్యేక పూజలు చేశారు. పుట్టపై పసుపు కుంకుమ వేసి నూతన దుస్తులను పెట్టి పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సతీమని సరోజన పట్టణంలోని పాము పుట్ట వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు.పండుగ నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
'భక్తులతో కిక్కిరిసిపోయిన నాగదేవత ఆలయాలు'
జగిత్యాల జిల్లాలో నాగుల పంచమి పండుగ సందర్భంగా నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాముల పుట్టలో పాలు పోసి మెుక్కులు చెల్లించుకున్నారు.
పుట్టలో పాలు పోసి మెుక్కులు చెల్లించుకున్న మహిళలు
ఇవీ చూడండి : గోదావరి అందాలు... కృష్ణమ్మ పరవళ్లు