తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు.. ఆరోగ్యం ఎలా ఉంది? - corona survey in jagtial

కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో ప్రత్యేక సర్వే చేపట్టింది. కరోనా లక్షణాలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, గర్భిణులను గుర్తించడం కోసం ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలతో సర్వే నిర్వహిస్తోంది.

HOME SURVEY OF PATIENTS AT METPALLY IN JAGTIAL DISTRICT
ఇంటింటా ప్రత్యేక సర్వే

By

Published : May 3, 2020, 8:58 AM IST

కరోనా నియంత్రణలో భాగంగా జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో ఏఎన్​ఎం ఆశావర్కర్లు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. కరోనా లక్షణాలు, దీర్ఘకాలిక వ్యాధులు, గర్భిణిలను గుర్తించడం వైద్య ఆరోగ్య శాఖ సర్వే చేపట్టింది. దగ్గు, జ్వరం, జలుబు, తలనొప్పి లక్షణాలు ఉన్నప్పటికీ చాలా మంది వైద్యులను సంప్రదించడం లేదు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాధి లక్షణాలున్న వారి గుర్తింపునకు ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.

వైద్యులను సంప్రదించాక వారి సలహాల మేరకే మందులు వాడాలని, దుకాణాలకు వెళ్లి తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు. పట్టణంలోని ప్రజలు ఏ రోగాలతో బాధ పడుతున్నారు, వాడుతున్న మందులు, కరోనా లక్షణాలున్న వారి వివరాలు తెలుసుకోడానికి ఈ సర్వే చేపట్టామనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ నరేందర్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details