జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం ముక్కట్రావుపేటలోని దూగుట్టపై పురాతన కాలానికి చెందిన పలు చారిత్రక ఆనవాళ్లను పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి గురువారం గుర్తించారు. దూగుట్టపై గుహ, దాని పైభాగాన నీటి తొట్టెను పరిశోధించారు.
దూగుట్టపై చారిత్రక ఆనవాళ్లు - Historical landmarks are available in the Jagityal district
జగిత్యాల జిల్లా దూగుట్టపై పురాతన కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్లు బయటపడ్డాయి. వీటిని పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి గురువారం గుర్తించారు.
Historical landmarks on Dugutta, Jagityal district
ఈ పరిసరాల్లో రాతిపూస, లైమ్‌స్టోన్‌కు చెందిన పనిముట్లు, పలు విగ్రహ శకలాలు, పూర్ణకుంభంతో కూడిన రాతి స్తంభం వంటి ఆధారాలు... గుట్ట చివరన సమతల ప్రదేశంలో బౌద్ధ స్తూపం ఉన్నట్లు గుర్తించారు. సుమారు పది వేల ఏళ్ల నాటివిగా భావిస్తున్న సూక్ష్మ రాతి పనిముట్లను కూడా కనుగొన్నట్లు రత్నాకర్‌రెడ్డి తెలిపారు.