జగిత్యాల జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గత మూడు రోజులుగా ఎండలు మండి పోతున్నాయి. నేడు 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిన్నటి కంటే ఈ రోజు మరింత ఉష్ణోగ్రతలు పెరగడంతో జనం విలవిల్లాడిపోతున్నారు. ఎండపల్లి, రాజారాం పల్లి, వెల్గటూర్‌లో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా... ధర్మపురిలో 47, నేరెళ్లలో 46.8, కొలువాయి, బీర్పూర్లో 46.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌కు తోడు ఎండలు పెరగటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.
జగిత్యాలలో భానుడి ప్రతాపం... 47 డిగ్రీల ఉష్ణోగ్రత
భానుడు తన ప్రతాపాన్ని కొనసాగిస్తున్నాడు. తీవ్రమైన ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. లాక్డౌన్ సడలింపులు వచ్చినా కూడా ఎండ తీవ్రత వల్ల ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.
జగిత్యాలలో భానుడి ప్రతాపం... 47 డిగ్రీల ఉష్ణోగ్రత