SWEET POTATO: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లికి చెందిన యువకుడు కలకుంట్ల సంతోష్ రావు ఆస్ట్రేలియా రకం చిలగడదుంపను పండించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఏడాది క్రితం తన స్నేహితుడు అక్కడి నుంచి తెచ్చిన మొక్కను ఇంటిఆవరణలో పెంచాడు.
SWEET POTATO: దుంప ఒక్కటే.. బరువు పదకొండు కిలోల పైనే..!
SWEET POTATO: మార్కెట్లో చిలగడదుంప సాధారణంగా కిలోకు ఎనిమిది లేదా పది తూగుతాయి. కానీ ఈ దుంప మాత్రం అందుకు భిన్నం. చూడగానే అందరినీ అబ్బురపరుస్తోంది. మహా అయితే వందో.. రెండు వందల గ్రాముల లోపు ఉండే చిలగడ దుంప.. ఏకంగా పదకొండు కిలోకు పైగా బరువు ఉండడమే ఇక్కడ విశేషం.
చిలగడదుంప
ఇక్కడి వాతావరణం సరిపడే విధంగా జాగ్రత్తలు తీసుకున్నాడు. దీనితో ఏకంగా 11కిలోల చిలగడదుంప కాసింది. సదరు చిలగడదుంప ఆస్ట్రేలియాలో ఉత్తమ రకమైన వంగడమని ఉద్యానవన విస్తరణ అధికారి అన్వేష్ తెలిపారు. 11 కిలోలు పెరిగిన ఓ భారీ దుంపను చూసేందుకు స్థానికులు తరలివస్తున్నారు.
ఇదీ చదవండి: TS Weather Report: రాష్ట్రంలో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం