తెలంగాణ

telangana

ETV Bharat / state

అకాల వర్షానికి తల్లడిల్లిన అన్నదాత - జగిత్యాలలో భారీ వర్షం

ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షం జగిత్యాల జిల్లాలో బీభత్సం సృష్టించింది. వర్షానికి కొన్నిచోట్ల ధాన్యం రాశులు తడిచిపోగా.. మరికొన్ని చోట్ల నీటి ప్రవాహనికి ధాన్యం కొట్టుకుపోయింది. రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చింది.

heavy unseasonal rain in jagtial district
అకాల వర్షానికి తల్లడిల్లిన అన్నదాత

By

Published : May 10, 2020, 7:24 PM IST

జగిత్యాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌, కోరుట్ల, రాయికల్‌, ధర్మపురి, జగిత్యాల, సారంగపూర్‌, బీర్‌పూర్‌, మల్యాల, గొల్లపల్లి, పెగడపల్లి తదితర మండలాల్లో గంటకుపైగా భారీ వర్షం కురిసింది.

ఈదురు గాలులతో కురిసిన వర్షానికి కొన్నిచోట్ల కళ్లాల్లో ఉన్న ధాన్యం కుప్పలు తడిచిపోగా.. మరికొన్ని చోట్ల నీటి ప్రవాహనికి ధాన్యం కొట్టుకుపోయింది. కళ్లముందే ధాన్యం కొట్టుకు పోతుంటే... అన్నదాతలు కన్నీరుమున్నీరయ్యారు. కోతకు వచ్చిన మామిడి కాయలు రాలిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది.

ఇప్పటికే పలు మార్లు ఆకాల వర్షంతో కుదేలైన రైతులకు మరోసారి భారీ వర్షం కారణంగ కర్షకులు కుంగిపోయారు. ప్రభుత్వంమే ఆదుకోవాలని వేడుకుంటున్నరు.

ఇదీ చూడండి:వంద శాతం పన్ను వసూళ్లే లక్ష్యంగా ప్రభుత్వ కార్యాచరణ

ABOUT THE AUTHOR

...view details