తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: కోరుట్లలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ - heavy safety measures in korutla in view of corona virus '

కరోనా వైరస్‌ ప్రభావంతో జగిత్యాల జిల్లా కోరుట్లలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను నిర్వహిస్తున్నారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో అన్ని వీధులకు బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

heavy-safety-measures-in-korutla-in-view-of-corona-virus
కోరుట్లలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

By

Published : Apr 9, 2020, 11:18 AM IST

జగిత్యాల జిల్లా కోరుట్లలో రెండు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కాగా పట్టణంలో పోలీసులు కట్టిదిట్టమైన భద్రతను అమలు చేశారు. కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామంలో ఒకరికి.. భీముని దుబ్బలో మరొకరికి వైరస్‌ సోకగా.. ఈ రెండు ప్రాంతాల్లో ప్రజలు ఎక్కడికీ వెళ్లకుండా పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు.

భీమునిదుబ్బలో అన్ని వీధులకు బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలు ఎవరు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికారులు ఇంటింటికి తిరుగుతూ శుభ్రత పాటించాలంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వైద్యులు ఎప్పటికప్పుడు నిషేధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇవీ చూడండి:కోయలేక.. కోసినా అమ్మలేక.. చ'మిర్చి'న రైతు కళ్లు!

ABOUT THE AUTHOR

...view details