మృగశిర కార్తెను పురస్కరించుకుని చేపల మార్కెట్లలో రద్దీ నెలకొంది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని చేపల మార్కెట్ కిక్కిరిసింది. మృగశిర కార్తె నాడు చేపలు తింటే ఏడాది పాటు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారనే నమ్మకంతో ఈరోజున చేపలు తీసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతారు.
మృగశిర: కిక్కిరిసిన చేపల మార్కెట్లు - తెలంగాణ వార్తలు
మృగశిర కార్తె సందర్భంగా చేపల మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. మెట్పల్లిలోని చేపల మార్కెట్లో ఉదయం నుంచే రద్దీ నెలకొంది. సాధారణం కన్నా నేడు ధరలు పెరిగాయని కొనుగోలుదారులు వాపోయారు.

మెట్పల్లి చేపల మార్కెట్, జగిత్యాల జిల్లా వార్తలు
ఈరోజు తెల్లవారుజాము నుంచే మార్కెట్లకు తరలివస్తున్నారు. సాధారణంగా కేజీ రూ.200 ఉన్న చేపల ధర ఇవాళ రూ.250కి పైగా పలికిందని కొనుగోలుదారులు వాపోయారు. మార్కెట్లో కరోనా నిబంధనలు గాలికొదిలేశారు.
ఇదీ చదవండి:Mrigashira karte: రద్దీగా చేపల మార్కెట్లు.. నిబంధనలు బేఖాతారు