తెలంగాణ

telangana

ETV Bharat / state

మృగశిర కార్తె మురిపెం... చేపల మార్కెట్లలో కోలాహలం.. - మృగశిర కార్తె రోజున కిటకిటలాడిన చేపల మార్కెట్లు

మృగశిర కార్తెను పురస్కరించుకుని ప్రజలు చేపలు తినాలనే ఉద్దేశంతో మార్కెట్లకు తరలిపోగా... జగిత్యాల చేపల మార్కెట్​ రద్దీగా మారింది. మీనాల ధరలు పెంచినా.. వాటిని కొనేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.

heavy rush at metpalli fish market due to mrugasira karte
మృగశిర కార్తె రోజున కిటకిటలాడిన చేపల మార్కెట్లు

By

Published : Jun 8, 2020, 12:41 PM IST

మృగశిర కార్తె రోజున చేపలను ఆహారంగా తీసుకుంటే సంవత్సరమంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారనే నమ్మకం ప్రజల్లో ఉండగా.. సోమవారం చేపల మార్కెట్లు ప్రజలతో కిక్కిరిసిపోయాయి. జగిత్యాల జిల్లా మెట్​పల్లి చేపల మార్కెట్ తెల్లవారుజాము నుంచే ప్రజలతో రద్దీగా కనిపించింది. మత్స్యకారులు మార్కెట్లో వివిధ రకాల చేపలను విక్రయించారు.

మృగశిర కార్తె సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలిరాగా.. విక్రేతలు ధరను అమాంతం పెంచేశారు. కరోనా విజృంభిస్తున్నా మార్కెట్​లో ప్రజలు భౌతిక దూరం మరిచి.. ఒకరిపై ఒకరు పడుతూనే కొనుగోళ్లు జరుపుతున్నారు. లాక్​డౌన్​ నిబంధనలను ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల జాగ్రత్తలు తీసుకుని వచ్చిన వారు ఆందోళనకు గురయ్యారు.

ఇవీ చూడండి:కరోనా వేళ.. చేపల కోసం పోటెత్తిన జనం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details