జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. వరద నీటితో చెరువులు అలుగు పోస్తున్నాయి. వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. జాతీయ రహదారిపై అనంతారం వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వంతెనపై నీరు పారడం వల్ల జగిత్యాల- ధర్మపురికి రాకపోకలు నిలిచిపోయాయి.
జలమయమైన జగిత్యాల... ఊర్లమధ్య నిలిచిపోయిన రాకపోకలు - జగిత్యాలలో భారీ వర్షం
జగిత్యాలలో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపిలేని వానతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వంతెనలపై నుంచి నీరు పారడం వల్ల పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
జలమయమైన జగిత్యాల... ఊర్లమధ్య నిలిచిపోయిన రాకపోకలు
చలిగల్ ఒర్రె వంతెనపై నీరు ప్రవహించడం వల్ల రాయికల్- జగిత్యాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కొనాపూర్ వాగు వంతెనపై పారుతోంది. రాయికల్ మండలంలోని మైతాపూర్, సింగరావు పేట, జగిత్యాల పట్టణం గోవిందు పల్లె, పోచమ్మ వాడ, టవర్ సర్కిల్ ప్రాంతంలో పలు ఇళ్లలోకి నీరు చేరింది.
ఇదీ చూడండి:రాష్ట్రంలో తాజాగా 2,058 మందికి కరోనా